09/10/2026
అమరావతి రైతులకు 25 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు!
✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన నిడమర్రు గ్రామానికి చెందిన రైతులకు శుక్రవారం 2026 అక్టోబర్ 9న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 25 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది..అట్టి ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారు తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి..అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ- లాటరీ ద్వారా శుక్రవారం కేటాయించడం జరిగింది.
✅కార్యక్రమానికి హాజరైన రైతుల సమక్షంలో ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా నివాస, వాణిజ్య ప్లాట్లకు ముందుగా ట్రైల్ రన్ వేసిన అనంతరం ప్రత్యక్ష లాటరీ ప్రక్రియను చేపట్టడం జరిగింది. రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులకు APCRDA అడిషనల్ కమిషనర్ కె.కార్తీక్ ఐఏఎస్ గారు, ల్యాండ్స్ విభాగ డైరెక్టర్(క్యాపిటల్ సిటీ) కె.ఎస్. భాగ్యరేఖ గారు, నిడమర్రు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.భద్రు గారు, ఇతర అధికారులతో కలసి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తంగా తొమ్మిది మంది రైతులకు శుక్రవారం 25 ప్లాట్లను కేటాయించారు. వీటిలో 17 రెసిడెన్షియల్, 8 కమర్షియల్ ప్లాట్లు.
✅ఈ కార్యక్రమం నిర్వహించిన కార్తీక్ గారు..రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. ప్లాట్లు పొందిన రైతులకు.. భౌగోళికంగా వారికి ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లు సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో IT విభాగ అడిషనల్ డైరెక్టర్ కుశ్వంత్, ప్లానింగ్, ల్యాండ్స్, కమ్యూనికేషన్స్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.