08/08/2026
ఆమెకూ ఒక మనసుంది...!!!
బుడి బుడి అడుగుల నుండి
బడి వైపు పరిగెత్తాలని
చదువుకున్న దానికి
సార్థకత చూపాలని
ఒక ఇంటి మహారాణి
ఇంకో ఇంటి కి బానిస అవొద్దని
నాన్న గుండెల మీద ఆడినా
మొగుడు గుండెల మీద తన్నడని
సూటి పోటీ మాటలకి ఎదురు తిరగాలని
చుట్టాల మధ్య గౌరవంగా బతకాలని
అమ్మగా చూచి రాతలు రాయించినా
తన తల రాత తాను రాసుకోలేని తనకీ
పెరట్లో పూలతో మురిసిన మనసుకీ
ఆకాశపు అంచులు తాకిన చేతులకీ
పరిస్థితులను ప్రశ్నించాలని
ఆ ప్రశ్నలకి సమాధానం కావాలని
మీ
శివ ప్రసాద్ మందపూడి
8179066626
స్వస్థలం: నేరేడుచర్ల, సూర్యాపేట జిల్లా
నివాసం: మియాపూర్, హైదరాబాద్